సెప్టెంబర్ 1 - సరస్వతీ పుత్రుని 26వ వర్ధంతి. మా అయ్యగారికి కన్నీటి నివాళి.
కన్నుల్ గానక నీదు భవ్య కవితా గానంపు మర్మమ్ములన్
పన్నొందన్ రస రమ్య రీతులనుగా వర్ణింప నే
వింటినే?
మిన్నున్ మన్నును గానకే
మహిషినై యీలాగుపేక్షించితిన్,
నన్నున్ నీ నిజ పుత్రికన్
కరుణతో నారాయణా ! బ్రోవవే!
మూడవ పాదమందు అచ్చు ఆధారంగా సంధియుత యతి మైత్రి (చందం.డాట్.కం.
ప్రామాణికంగా ) గుర్తించడమైనది.)
...............
ఇరువది యైదు వత్సరములీగతి అయ్యరొ! యీడ్చితేను, నా
కిరవగు రీతులందు తవ కీర్తనమందున
సొక్కి సోలితిన్,
మరువక నన్ను నీదు పధమందున జేరుచుకొమ్ము ! నీ దయా
మరువక సౌరభమ్ములవి మామక జీవన భావి గావలెన్.