Wednesday, 22 March 2017

శోభనాచల: పుట్టపర్తి వారి సంగీత నాటిక – చింతయంతి

శోభనాచల: పుట్టపర్తి వారి సంగీత నాటిక – చింతయంతి: కృష్ణతత్వం ఇతివృత్తంగా సాగే సంగీత నాటిక “చింతయంతి”, రచన శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారం.  ...

శోభనాచల: పుట్టపర్తివారి శివతాండవము – మరో రికార్డింగ్

సరస్వతీపుత్రులవారి జయంతి 28 మార్చ్ సమీపిస్తున్న కొద్దీ....నాలో యేదో నిర్వచింపలేని ఆవేదన..ఆక్రోశం...ఈ రికార్డింగ్ సమయం, సరిగ్గా, జ్ఞానపీఠ గౌరవం దూరమైన వికల మానస పుంభావసరస్వతిని దగ్గరగా చూస్తున్న నిస్సహాయ క్షణ సముదాయం....అయ్య గొంతు వింటుంటే....కన్నీటి కాల్వలౌతున్నాయి కళ్ళు....మీరేమంటారో..మరి.... మరో సంగతి, యీ రికార్డింగ్ సమయంలో, నేను హైద్రాబాద్ ఆకాశవాణిలోనే పనిచేస్తున్నాను. అయ్యతో నేనూ, రికార్డింగ్ సమ్యంలో ఉన్నాను. మొత్తం గంటపైనే రికార్డ్ అయింది.అయ్యకు దగ్గు తెరలు తెరలుగా వస్తుంటే, దగ్గరే నీళ్ళ బాటిల్లో నీళ్ళందిస్తూ, కూర్చున్నాను. మొట్టమొదటిసారి, రెండు భాగాలుగా ప్రసారమైనట్టు గుర్తు.(ఇప్పుడిలా అరగంటే ప్రసారం చేశరు, సమయాన్ని బట్టి)  నేను నా దగ్గర భద్ర పరచుకుందామని వెదికితే, ఆ టేప్ దొరకనే లేదు. ఇన్నాళ్ళకిలా శోభనాచల వారి బ్లాగ్ ద్వారా వినగల్గటం, ఆనందాశ్చర్యం...


శోభనాచల: పుట్టపర్తివారి శివతాండవము – మరో రికార్డింగ్: గతంలో పుట్టపర్తి నారాయణాచార్యులు గారు పాడిన శివతాండవము పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈసారి ఇంకో రికార్డింగ్ విందాము. దీంట్లో రావూరి భర...