అపరాధ సహస్ర భాజనం.....
.....
రవిగారి వ్యాఖ్య..నా గుండెలోని మంటకు అక్షర రూపం ఇచ్చి
మీవంటి మంచి మిత్రులతొ పంచుకుని ఉపశమనం పొందే ప్రయత్నానికి పురికొల్పింది.
అయ్య అజరామరులే..నా బాధంతా కడుపున పుట్టికూడా
కొంతైనా ఆ సరస్వతీ పుత్రుని అనుసరింపకపోయామే
అని..అడుగడుగునా ఆ బాధ అన్నమయ్య చెప్పినట్టు, గుండె
నిండా ఒక మంటవలె సలుపుతూనే ఉంటుంది ...
.'అపరాధ సహస్ర భాజనం .. పతితం భీమ భవార్ణవోదరే,
అగతిం శరణాగతిం, హరే:! కృపయా కేవలమాత్మసాత్ కురు
అని పూజ తరువాత ముగింపులో రోజూ మంగళాశసనం లో
చెప్పుకునే యీ శ్లోకం రాగానే దానిలోని 'అపరాధ సహస్త్ర
భాజినం' అన్న పదం దగ్గరే నాకెప్పుడూ ..'గుండె గొంతుకడ్డం
పడి, శ్లోకం ముందుకు జరుగదు.అయ్యా, మా అమ్మల
మూర్తిమత్వాన్ని గుర్తించలేని అజ్ఞానంలో వాళ్ళు శరీరధారులై
ఉన్నన్నాళ్ళూ, కళ్ళుకు గంతలు కట్టినట్టు, అవివేకపు పొర
మనసును కమ్మేసే ఉంచాడా పైవాడు. తెలిసీ, తెలియకా,
వాళ్ళిద్దరినీ అందరి తల్లిదండ్రులవలెనే భావించి, బాధించి,
ఇప్పుడు వాళ్ళిద్దరూ కీర్తిశేషులైన తరువాతే, కేవలం
పశ్చాత్తాపానికే పరిమితం చేశాడా పైవాడని.....అపరాధ
భావం..ఈ లోనున్న మంట,జీవిత గమనంలో నాకైతే చాలా
సందర్భాలలో.
. ప్రత్యేకించి, ప్రతి వత్సరమూ ఆగష్ట్ 2 నుండీ,సెప్టెంబర్ 1
వరకూ...ఊపిరి సలుపనివ్వదు.. అయ్య అవతారం
చాలించేందుకు కొన్ని రోజుల ముందు అప్పటి, మా ఆనంద్
బాగ్ ఇంట్లో, మామిడి చెట్టుకింద మంచంలో
పడుకునీ, ఇంటి ముందు వరండాలో కూర్చుని, తన
అనారోగ్యం బాధను శరీరానికే పరిమితం చేస్తూ, తనప్రియ
శిష్యుడు, రఘోత్తమ రావుకు కొన్ని రోజులు భాగవత
శ్లోకార్థాలు చెప్పేవారు. మేమంతా అన్నయ్యగా
పిలుచుకునే మాలేపాటి సుబ్రమణ్యం, అయ్య శారీరిక
అవసరాలకు తోడుగా ఉండేవాడు. అప్పుడూ నాకు వెధవ
ఆఫీసు గోలే!! ఆ అపురూప క్షణాల్లో అందివచ్చిన ఆ
వ్యాఖ్యాశ్రవణ భాగ్యాన్ని పొందలేక పోయానే అని యెంత
బాధో ! మ అన్నయ్యతో పాటూ, నేనూ అయ్య మల
మూత్రాదులు శుభ్రం చేస్తుంటే, కన్నీళ్ళు పెట్టుకుని
'ఆడపిల్ల తో చేయించుకుంటున్నాను. ' అని
బాధ పడ్డారు కూడా ! నేనన్నాను..నేను మీ బిడ్డనయ్యా
..నాకూ మీ బాధ్యత ఉందంతే. మీరు బాధపడవద్దండీ '
అని..ఆగష్ట్ 18 హైద్రాబాద్ నుండి బలవంతంగా కడపకు
వెళ్ళిపోయారు. సెప్తెంబర్ 1 నాటికి ఉదయాన్నే
టెలిగ్రాం. ఇక కథంతా తెలిసిందే..అందుకే ..
యీ అపరాధ భావం....
ఈ సమూహం నాకింతమంది మంచి, సమస్పందనలున్న
స్నేహ సంపదనిచ్చిందనీ.., నా బాధలూ, సంతోషాలూ మీతో
పంచుకున్నా తృప్తే కదా అని.. యెంతో ధైర్యంగా
ఉంటుందిప్పుడు తెలుసా....

padminigaru u proed that u r a worthy daughter
ReplyDelete