గరికపాటివారి నోట పుట్టపర్తివారి మాట....వీరరస వర్ణన..
కదన ముఖంబునన్, పిరికి కండలు కాననివారు ధీరతా
స్పదులగు భర్తలు ఉద్దవిడి, శాత్రవులన్ చెరలాడి వచ్చుచో,
అదును దొలంకు వారి కరవాలపు నెత్తుట కుంకుమాకృతుల్,
వదనమునందు దిద్దుకొను పత్నులకెల్ల నమస్కరించెదన్..(సాక్షాత్కారం నుండి)
గరికపాటివారంటరూ...ఈ పద్యాన్ని, మన రాజకీయ నాయకుల ఇళ్ళముందు, ఫ్లెక్సీలుగా పెట్టాలట! కేవల ధన సంపాదనమీదే దృష్టిఉంచి రాజకీయాల్లో చేరటం కాదు. ప్రజలతరఫునే వాదించాలి కానీ..అవకాశవాదాన్ని ఆశ్రయించటం కాదు అంటారు . క్షత్రియ వనితలు భర్తలు యుద్ధానికి వెళ్ళేటపుడు తమరక్తంతో తిలకం దిద్దుతారు..... విజయంతో భర్త ఇంటికి వచ్చాక కత్తికంటిన శత్రువుల రక్తంతో తాము తిలకం దిద్దుకుంటారు. ఈ పౌరుషం ఇప్పుడేదీ? ధర్మము అన్నమాటకు, మనమనుకునే అర్థమే కక విల్లు అనికూడా అర్థం ఉంది. ధర్మ రక్షణకై విల్లుకూడా అందుకోవలసిన అవసరం ఉంటుందెప్పుడూ..అంటారు వారు..(52 వ నిముషం నుండీ పన్నెండు నిముషాలపాటు పుట్టపర్తి పద్య విశ్లేషణ) మొత్తం వినండి..అద్భుతంగా ఉంది ఆ వాక్ప్రవాహం...
ఈ వీడియో వివరాలిచ్చిన శ్రీ అంబటిపూడి నాగ త్రివిక్రంగారికి (డల్లాస్) ధన్యవాదాలు, ఆశీస్సులు..
No comments:
Post a Comment