Sunday, 27 March 2016

                          అయ్యా! మీకు జన్మదిన శుభాకాంక్షలు...
             మళ్ళీ మళ్ళీ ...
             మీ కడుపునే పుట్టేలా ఆశీర్వదించండి !
             మా ఆచార్యులు మీరే! 

              ఆరాధ్యులూ  మీరే !  
              ఇప్పటికీ ! యెప్పటికీ !
                                                 (28-3-1914 )

Saturday, 19 March 2016

Dr KV Ramana Chary ,IAS Retd Advisor to Govt Released Book Of Dr Puttapa...



Part 2 of the book releasing function of maa ayyagaru Dr.Puttaparthi Narayanacharya on 14th March 2016 at Telangana bhavan in the august presence of Dr.K.V.Ramanacharya, Cultural advisor to the Govt. of Telangana




Book Release of VIMARSA Tarangini of Dr.Puttaparthi.by Dr.K.V.Ramanachar...



Part I  of the book releasing function of maa ayyagaru's VIMARSA TARANGINI in Telangana Bhavan, on 14th March 2014 in the august presence of Dr.K.V.Ramanacharya, advisor to the Govt. of Telangana.






 

Tuesday, 15 March 2016


Frends dears...
I am very much excited with this joy of released CRITISISM books (2parts) of my revered  father Dr.Puttaparthi. My dream of 25 years is now fulfilled by this edition of my father's works.
I will be more happy if my father's fans, read them and share their views. They may be available at NAVODAYA and TELUGU BOOK HOUSE, both at Arya samaj Road, Kachiguda cross Roads, Hyderabad.
 

Tuesday, 8 March 2016


త్వరలో రాబోతున్న 'పుట్టపర్తి విమర్శతరంగిణి' -రెండవభాగము

........................

          ప్రస్తుతము ప్రకటించిన 'ఋతుఘోష' రెండు కావ్యముల సంకలనము. ఋతువర్ణనము ప్రధానంగా నడుస్తుంది. ఒక ప్రియాప్రియుల ప్రేమగాధ అంగంగా సాక్షాత్కరిస్తుంది. ఈ సంకలనమెందుకని కవిగారినే ప్రశ్నించినాను. ఋతువర్ణనమొక్కటే ఐతే చదవడానికి బాగుండదేమోనని ఈ పని చేసినామన్నారు. చేర్చకుండా వుంటే బాగుండేదని నా ఊహ....
.............
         శర్మగారిలో విశ్వనాధ, జాషువా, రాయప్రోలు, కృష్ణాశాస్త్రి మొదలగువారి పలుకుబడులు అక్కడక్కడా కనబడుతూ ఉంటాయి. శర్మగారికి తెనాలి రామకృష్ణుడన్నా పక్షపాతమే ! కొన్ని చోట్ల ఈ కవి, నేరుగా ఉమర్ఖయ్యాముకు శిష్యుడై కనిపిస్తాడు. వర్షఋతువును వర్ణిస్తూ, 'ఆత్మవేదనకొక యాకారమై తోచి నేటి రేయి నన్ను కాటు వేసె' అంటాడు. ఇట్టి పోకడలనే, 'సబ్జెక్టివ్ పొయెట్రీ ' అంటారు మర్మవిదులు.

...........


 

              'ఆరుద్ర' కు నియమోల్లంఘనం చేయడమే స్వభావమని చెప్పినాను. కనుక యీ రచనలో, బాల వ్యాకరణాన్నీ, పాణినీయాన్నీ వెదకడం కష్టం. కవిత్వమనే పదార్థం ఇంతకు మించినది అనే దృష్టిని పట్టుకుంటే, యీ కావ్యం చదువవచ్చు.
  జయంగొండార్ కవి తమిళంలో చాలా ప్రసిద్ధుడు. లలితుడుకూడా !
పరణి అని వీరకావ్యానికి పేరు. యెటువంటి వీరకావ్యం అనే విషయంలో ఒకటి రెండు వ్యాఖ్యాన భేదాలు లేకపోలేదు. కవి మొదటి కుళోత్తుంగుని ఆస్థానంలో వుండినాడు. మదటి కుళోత్తుంగుడు, మన రాజరాజనరేంద్రుని కుమారుడే ! చోళ చాళుక్యులకు చాలా సంబంధ బాంధవ్యాలుండేవి.
      తమిళంలోకి మనం ప్రవేశించినప్పుడు, కొన్ని కొన్ని కొత్త సంకేతాలూ, అలంకారాలూ, ఆచారాలూ- మన కంట పడతాయి. తమిళ వాంగ్మయమే సంస్కృతంతో సంబంధంలేని ఒక మహా ప్రపంచం. ఉడుక వాద్యంతో నడుమును పోల్చడం, పగడసారెలతో స్తనమండలాన్ని పోల్చడమూ అంతే !
................
         శేషేన్ గారి 'ౠతుఘోష' కు పుట్టపర్తి 18-2-63 నాటి విపుల పీఠికా, ఆరుద్ర గారి తమిళానువాదం 'వేసవి- వెన్నెల' పై పుట్టపర్తి వారి చెణుకులూ ('63)..మరింకా యెన్నేన్నో. పుట్టపర్తి వివిధ భాషా సాహితీవిన్నాణానికి అద్దంపడుతూ..'పుట్టపర్తి విమర్శ తరంగిణి - రెండవ భాగం' లో మీముందుకు రాబోతున్నాయి....

........................






పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ : ఏకవీర నవల కేవలం మూడు రోజులలోనే మళయాళం లోకి

పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ : ఏకవీర నవల కేవలం మూడు రోజులలోనే మళయాళం లోకి: శ్రీరంగాచార్యులు గారు పుట్టపర్తి గురించి చెప్పిన విశేషాలు.. పుట్టపర్తి ఏకవీర నవలలు కేవలం మూడు రోజులలోనే మళయాళం లోకి అనువదించారట.. ఈ రికా...

'పుట్టపర్తి విమర్శ తరంగిణి - రెండవ భాగం'




 

నాకాంగ్లముపై ద్వేషము లేదు. అది మనదేశమునకెంతయో ఉపకారము చేసినది. ఇంగ్లీషును తిట్టు పండితులను చూసిన నాకసహ్యమే ! ఒక ఇంగ్లీషేమి? ప్రతిభాషకూడ యెంతో యుపకారమొనర్చును. ఆంగ్లేయులుకూడ మనభాషకు తక్కువ సేవచేసినవారు కాదు. దక్షిణభాషలకు మొదటి నిఘంటువును వ్రాసినవారందరునాంగ్లేయులే ! బ్రౌనుదొర మనభాషకుచేసిన సేవ సామాన్యమైనదికాదు. అదియాతనికి తండ్రినుండి సంక్రమించిన యాస్తి. అతడు వంగాదిభాషలకెంతయో సేవచేసినవాడు. ఆంగ్లేయులు సంస్కృతమునకు చేసిన సేవ మనము సిగ్గుపడవలసినంతటిది.'

ఆంగ్లేయ పండితుల గురించీ, బ్రౌను దొర గురించి పుట్టపర్తి తన అభిప్రాయాలను ఇంత కుండబద్దలు కొట్టేలా వెలువరించిన సందర్భమేది? త్వరలో మీముందుండబోతున్న 'పుట్టపర్తి విమర్శ తరంగిణి - రెండవ భాగం'లో యీ వాస్తవాలు మీముందుకు రాబోతున్నాయి... .





Monday, 7 March 2016


 'ఉత్తరాది మఠ స్వాములు సత్య ధ్యానతీర్థులుండిరి. వారు ద్వైతులు. దానశూరులు. వారికదిశంకరుల గ్రంధములు కొట్టిన పిండి. వాదములలో శాంకర గ్రంధములలో పరస్పర వైరుధ్యములు చూపెడివారు. పూర్వపక్షమునకేయవకాశమివ్వరు. వీరుజూపించు విరోధములనెత్తిపోసుకొనుటలొనే  ప్రతివాదులకు, సరిపోవును. ఇదియొక మహాప్రతిభ. కళాశాలాధ్యక్షులు సుబ్బరావుగారుండిరి. అదియొక జ్ఞానప్రధానావతారము.  వారేశాస్త్రములో పూర్వపక్షము జేసిననూ, సమాధానము వారుజెప్పవలసినదే! అట్టి వాద సభలు కాళిదసన్నట్టు, 'కాంతుం క్రతుం చాక్షుషం..' .అంతే !
   (త్వరలో రాబోతున్న పుట్టపర్తి  విమర్శతరంగిణి(రెండవభాగము) నుండీ! (ప్రతులు  కావలసిన మిత్ర బృందము వివరములకొరకై నాకు   సందేశమివ్వగలరు)



Thursday, 3 March 2016




Ayya remembered on the eve of SIVARATRI in Today's (4th March 2016)Andhra Jyothi (Nivedana Page)