Tuesday 8 March 2016


త్వరలో రాబోతున్న 'పుట్టపర్తి విమర్శతరంగిణి' -రెండవభాగము

........................

          ప్రస్తుతము ప్రకటించిన 'ఋతుఘోష' రెండు కావ్యముల సంకలనము. ఋతువర్ణనము ప్రధానంగా నడుస్తుంది. ఒక ప్రియాప్రియుల ప్రేమగాధ అంగంగా సాక్షాత్కరిస్తుంది. ఈ సంకలనమెందుకని కవిగారినే ప్రశ్నించినాను. ఋతువర్ణనమొక్కటే ఐతే చదవడానికి బాగుండదేమోనని ఈ పని చేసినామన్నారు. చేర్చకుండా వుంటే బాగుండేదని నా ఊహ....
.............
         శర్మగారిలో విశ్వనాధ, జాషువా, రాయప్రోలు, కృష్ణాశాస్త్రి మొదలగువారి పలుకుబడులు అక్కడక్కడా కనబడుతూ ఉంటాయి. శర్మగారికి తెనాలి రామకృష్ణుడన్నా పక్షపాతమే ! కొన్ని చోట్ల ఈ కవి, నేరుగా ఉమర్ఖయ్యాముకు శిష్యుడై కనిపిస్తాడు. వర్షఋతువును వర్ణిస్తూ, 'ఆత్మవేదనకొక యాకారమై తోచి నేటి రేయి నన్ను కాటు వేసె' అంటాడు. ఇట్టి పోకడలనే, 'సబ్జెక్టివ్ పొయెట్రీ ' అంటారు మర్మవిదులు.

...........


 

              'ఆరుద్ర' కు నియమోల్లంఘనం చేయడమే స్వభావమని చెప్పినాను. కనుక యీ రచనలో, బాల వ్యాకరణాన్నీ, పాణినీయాన్నీ వెదకడం కష్టం. కవిత్వమనే పదార్థం ఇంతకు మించినది అనే దృష్టిని పట్టుకుంటే, యీ కావ్యం చదువవచ్చు.
  జయంగొండార్ కవి తమిళంలో చాలా ప్రసిద్ధుడు. లలితుడుకూడా !
పరణి అని వీరకావ్యానికి పేరు. యెటువంటి వీరకావ్యం అనే విషయంలో ఒకటి రెండు వ్యాఖ్యాన భేదాలు లేకపోలేదు. కవి మొదటి కుళోత్తుంగుని ఆస్థానంలో వుండినాడు. మదటి కుళోత్తుంగుడు, మన రాజరాజనరేంద్రుని కుమారుడే ! చోళ చాళుక్యులకు చాలా సంబంధ బాంధవ్యాలుండేవి.
      తమిళంలోకి మనం ప్రవేశించినప్పుడు, కొన్ని కొన్ని కొత్త సంకేతాలూ, అలంకారాలూ, ఆచారాలూ- మన కంట పడతాయి. తమిళ వాంగ్మయమే సంస్కృతంతో సంబంధంలేని ఒక మహా ప్రపంచం. ఉడుక వాద్యంతో నడుమును పోల్చడం, పగడసారెలతో స్తనమండలాన్ని పోల్చడమూ అంతే !
................
         శేషేన్ గారి 'ౠతుఘోష' కు పుట్టపర్తి 18-2-63 నాటి విపుల పీఠికా, ఆరుద్ర గారి తమిళానువాదం 'వేసవి- వెన్నెల' పై పుట్టపర్తి వారి చెణుకులూ ('63)..మరింకా యెన్నేన్నో. పుట్టపర్తి వివిధ భాషా సాహితీవిన్నాణానికి అద్దంపడుతూ..'పుట్టపర్తి విమర్శ తరంగిణి - రెండవ భాగం' లో మీముందుకు రాబోతున్నాయి....

........................






No comments:

Post a Comment