.................
గురజాడ దేశభక్తి గేయం చాలా గొప్పది. తెలెఉగులో అటువంటిది మరి లేదు. అంతమాత్రాన ప్రపంచ సాహిత్యంలోనే అటువంటిది లేదనటానికి సాహసించరాదు. అలగే మధురవాణి పాత్ర విషయం. మధురవాణి పాత్ర గొప్పదేకానీ, వసంతసేన కంటే గొప్పదని నేననలేను. గురజాడకు కూడా ఇలాంటి అభిప్రాయాలున్నాయి. చాసర్ వాల్మికి వంటివాడని గురజాడ అభిప్రాయపడ్డాడు. చాసర్ మీద ఇంగ్లీషువాళ్ళకే లేని గౌరవం, యీయనకెందుకు కలిగిందో నాకు అర్థం కావటంలేదు. అట్లే వర్డ్సవర్త్ మీద కూడా గురజాడకు విపరీతమైన గౌరవం. వర్డ్స్వర్త్ కు పూర్వం ఉన్న కవిత్వమంతా రాజుల రాణుల ప్రేమ పురాణాలూ, వీరగాధలే! సామాన్యుల జీవితాన్ని ప్రతిపాదించే కావ్యాలు కూడా చాలావరకు యీవిధంగానే వుందనవచ్చు. కానీ, సంస్కృత ప్రాకృతాల్లో మాగధి, అపభ్రంశ వంటి భాషల్లో సామాన్యుల గాధలు అనేకం ఉన్నాయి. జైన బౌద్ధ సాహిత్యమంతా సామాన్యుల కథలే ! ప్రసిద్ధమైన గాధాసప్త శతి
గురజాడ దేశభక్తి గేయం చాలా గొప్పది. తెలుగులో అటువంటిది మరి లేదు. అంతమాత్రాన ప్రపంచ సాహిత్యంలోనే అటువంటిది లేదనటానికి సాహసించరాదు. అలగే మధురవాణి పాత్ర విషయం. మధురవాణి పాత్ర గొప్పదేకానీ, వసంతసేన కంటే గొప్పదని నేననలేను. గురజాడకు కూడా ఇలాంటి అభిప్రాయాలున్నాయి. చాసర్ వాల్మికి వంటివాడని గురజాడ అభిప్రాయపడ్డాడు. చాసర్ మీద ఇంగ్లీషువాళ్ళకే లేని గౌరవం, యీయనకెందుకు కలిగిందో నాకు అర్థం కావటంలేదు. అట్లే వర్డ్స్ వర్త్ మీద కూడా గురజాడకు విపరీతమైన గౌరవం. వర్డ్స్ వర్త్ కు పూర్వం ఉన్న కవిత్వమంతా రాజుల రాణుల ప్రేమ పురాణాలూ, వీరగాధలే! సామాన్యుల జీవితాన్ని ప్రతిపాదించే కావ్యాలు కూడా చాలావరకు యీవిధంగానే వుందనవచ్చు. కానీ, సంస్కృత ప్రాకృతాల్లో మాగధి, అపభ్రంశ వంటి భాషల్లో సామాన్యుల గాధలు అనేకం ఉన్నాయి. జైన బౌద్ధ సాహిత్యమంతా సామాన్యుల కథలే ! ప్రసిద్ధమైన గాధాసప్త శతి ఆనాటి సామాన్యుల జీవితాన్ని చిత్రించే మనోహర సంకలనం. తెలుగులో మాత్రం మొన్న మొన్నటివరకు కవులు రాజులదగ్గర వేశ్యలవలెనే బ్రతికినారని చెప్పవచ్చు. కానీ తెలుగు సాహిత్యమంతా అట్టి సాహిత్యం అనలేము. (To be continued.....Friendz dears...Pl. note that this is the NEWS ITEM published in VISALANDHRA daily, on the GURAJADA vardhanti sabha hela at Kadapa prabably in 1968, preserved and given to me by Sri Ramavajhala srisailamgaru, last year. )
No comments:
Post a Comment