Monday, 30 November 2015


.................
      గురజాడ దేశభక్తి గేయం చాలా గొప్పది. తెలెఉగులో  అటువంటిది మరి లేదు.  అంతమాత్రాన ప్రపంచ సాహిత్యంలోనే  అటువంటిది లేదనటానికి   సాహసించరాదు. అలగే మధురవాణి పాత్ర విషయం. మధురవాణి పాత్ర  గొప్పదేకానీ, వసంతసేన కంటే గొప్పదని నేననలేను. గురజాడకు కూడా ఇలాంటి అభిప్రాయాలున్నాయి. చాసర్   వాల్మికి వంటివాడని గురజాడ అభిప్రాయపడ్డాడు. చాసర్  మీద ఇంగ్లీషువాళ్ళకే లేని గౌరవం, యీయనకెందుకు కలిగిందో నాకు అర్థం కావటంలేదు. అట్లే వర్డ్సవర్త్ మీద కూడా గురజాడకు విపరీతమైన  గౌరవం. వర్డ్స్వర్త్ కు పూర్వం ఉన్న కవిత్వమంతా రాజుల రాణుల ప్రేమ పురాణాలూ, వీరగాధలే! సామాన్యుల జీవితాన్ని ప్రతిపాదించే  కావ్యాలు కూడా చాలావరకు యీవిధంగానే వుందనవచ్చు.  కానీ,  సంస్కృత  ప్రాకృతాల్లో మాగధి, అపభ్రంశ వంటి భాషల్లో సామాన్యుల గాధలు అనేకం ఉన్నాయి. జైన బౌద్ధ సాహిత్యమంతా సామాన్యుల కథలే !   ప్రసిద్ధమైన  గాధాసప్త శతి
   గురజాడ దేశభక్తి గేయం చాలా గొప్పది. తెలుగులో   అటువంటిది మరి లేదు.  అంతమాత్రాన ప్రపంచ సాహిత్యంలోనే  అటువంటిది లేదనటానికి   సాహసించరాదు. అలగే మధురవాణి పాత్ర విషయం. మధురవాణి పాత్ర  గొప్పదేకానీ, వసంతసేన కంటే గొప్పదని నేననలేను. గురజాడకు కూడా ఇలాంటి అభిప్రాయాలున్నాయి. చాసర్   వాల్మికి వంటివాడని గురజాడ అభిప్రాయపడ్డాడు. చాసర్  మీద ఇంగ్లీషువాళ్ళకే లేని గౌరవం, యీయనకెందుకు కలిగిందో నాకు అర్థం కావటంలేదు. అట్లే వర్డ్స్  వర్త్ మీద కూడా గురజాడకు విపరీతమైన  గౌరవం. వర్డ్స్  వర్త్ కు పూర్వం ఉన్న కవిత్వమంతా రాజుల రాణుల ప్రేమ పురాణాలూ, వీరగాధలే! సామాన్యుల జీవితాన్ని ప్రతిపాదించే  కావ్యాలు కూడా చాలావరకు యీవిధంగానే వుందనవచ్చు.  కానీ,  సంస్కృత  ప్రాకృతాల్లో మాగధి, అపభ్రంశ వంటి భాషల్లో సామాన్యుల గాధలు అనేకం ఉన్నాయి. జైన బౌద్ధ సాహిత్యమంతా సామాన్యుల కథలే !   ప్రసిద్ధమైన  గాధాసప్త శతి ఆనాటి సామాన్యుల జీవితాన్ని చిత్రించే మనోహర సంకలనం. తెలుగులో మాత్రం మొన్న మొన్నటివరకు కవులు రాజులదగ్గర వేశ్యలవలెనే బ్రతికినారని  చెప్పవచ్చు. కానీ  తెలుగు సాహిత్యమంతా అట్టి సాహిత్యం అనలేము. (To be continued.....Friendz dears...Pl. note that this is the NEWS ITEM published in VISALANDHRA daily, on the GURAJADA vardhanti sabha hela at Kadapa  prabably in 1968, preserved and given to me by Sri Ramavajhala srisailamgaru, last year. )

(సంవత్సరం వివరాలు లేవుకానీ విశాలాంధ్ర వార్తాపత్రికలో చాలా విపులంగా వచ్చినె అంశమిది...)
                          గురజాడ మహా కవి మాత్రమే కాదు-
                          మహా పురుషుడు కూడా'  -  పుట్టపర్తి
కడప లో జరిగిన గురజాడ వర్ధంతి సభలో (30th Nov) పుట్టపర్తి నివాళి (తేదీ లేదు కానీ యీ విశేసలు విశాలాంధ్ర వర్తాపత్రికలో వచ్చాయి)
      పది వుపన్యాసాలకంటే, మహాకవి వాక్కు ఒక్కటి వేల  హృదయాలను కదిలింపగలదు. భావుకుడైన  కవికి అట్టి శక్తి ఉంది. సృజనాత్మక శక్తిలోని ఆ మెరుపును, అ ఆంతరిక జ్యోతిని గమనించి వినియోగించుకోలేకపోతే,  సామాజిక వుద్యమాలు తమ ప్రయోజనాలను  నెరవెర్చలేవు. నాటి సామాజిక వుద్యమాలకు  చేయూతనిచ్చిన గురజాడ ఒక విద్యుత్తు. ఆయన ఒక మహాకవే కాదు. ఒక మహాపురుషుడు కూడా! సాహిత్యకారులలో  చాలామందికి ఆత్మస్తుతి ఒక చాపల్యంగా వుంటుంది. ఆత్మవిశ్వాసం అన్న రూపంలో అది కొంతవరకూ అవసరమేమో  కూడా! కానీ దాని పాలు  మితిమీరితే దురభిమానం అనికూడా విమర్శించగలవాళ్ళున్నారు.  గురజాడమీద కూడా ఆ కాలంలో నిందాపూర్వకమైన దురుసు విమర్శలు కొన్ని వచ్చాయి. కానీ ఆయన అన్నింటినీ శాంతంగా పరిశీలించి, సరసంగా సమధానం చెప్పారు. గొప్పవాళ్ళ లక్షణం అది. అంతకంటే గొప్పది ఆయన  సాహసం. యెండుగడ్డి వంటి శుష్క పాండిత్యమే కవిత్వం అనుకునే రోజుల్లో, అంతమంది కవి వృషభులనూ, కవి శరభులనూ ధిక్కరించి, సంప్రదాయానికి  యెదురు నిలబడే సాహసం సామాన్యమైనది కాదు. ఆనాటి పండితులుకూడా  సామాన్యులేమీ కాదు. దిగ్దంతులవంటి వారు. శతావధానులు. వాళ్ళందరూ వ్యావహారిక భాషకు వ్యతిరేకులు. వాళ్ళ గ్రాంధిక  భాషావాదాన్ని చీల్చి చెండాడిన పిడుగు వంటి  గిడుగు లక్షణకతకాగా, ఆయన లక్షణాలకు  లక్ష్యంగా  గురజాడ సాహిత్య సృష్టి చేశాడు. 
     ఆనాటి సంఘ సంస్కరణోద్యమానికి వీరేశలింగం ఒక మహానేత. ఆయనకు అన్నివిధాలుగా అండదండలుగా వుండినవాడు గురజాడ. ఐనా , కందుకూరినికూడా విమర్శించేందుకు వెనుకాడని సత్యప్రియుడు గురజాడ. శ్రీ కందుకూరి రచనల్లోని శృంగారాన్ని నిస్సంకోచంగా ఆయన విమర్శించారు. 
  కవి క్రాంత దర్శి. నేటి పరిస్తుతులు గమనించి, రేపటికోసం సూచనలు చేయటమే క్రాంతదర్శి పని. అటువంటి గుణం గురజాడలో వుంది. ఒకనాటి అతివాదులు మరికొన్నాళ్ళకు మితవాదులు కావటం మనం చూస్తూనే వున్నాము. ఈ దృష్టితో చూస్తే గురజాడ యెల్లప్పటికీ అతివాది. అయన బ్రతికి వుంటే, మనలోని అతివాదులకంటే అతివాదిగా వుండేవాడనిపిస్తుంది. నాచ్ భోగం మేళాల సమస్య సానుల సమస్య,  కేవలం  నైతిక సమస్య అని ఆనాటి వాళ్ళ అభిప్రాయం. నీతిబోధనలతోనే సానులను సంస్కరించవచ్చునని అనుకునేవాళ్ళు. కానీ వేశ్యావృత్తి, ఆర్థిక సమస్యతో ముడిపడివుందని యీనాడు అందరికీ తెలిసినదే! ఆవిషయాన్ని అనాడే గుర్తించాడు గురజాడ. సంస్కర్త హృదయం అన్న కథలో ఆయనకున్న దృక్పథం స్పష్టంగా కనపడుతుంది. పరివర్తనచెందే కాలంతోపాటూ పరిణమించగల మేధస్సంపదా, విశాల హృదయమూ, సత్యప్రియత్వమూ మహాపురుషుని గొప్పగుణాలు.
      గురజాడ నిజంగా మహాకవి. ఆయనను ఇతరులతో పోల్చి, తెలుగువాళ్ళు గుడ్డివాళ్ళు కాబట్టి గురజాడ గొప్పదనాన్ని గుర్తించలేరని కొందరంటారు.  ఇందులో సత్యం ఉన్నమాట నిజమే కానీ, ఇలాంటి పోలికలు ఒక దౌర్బల్యం. వుదాహరణకు ఇక్బాల్, బంకిం ల రచనలు మనకు తెలియవు. మన కన్యాశుల్కం వంటి నాటకం తమిళులకు మళయాళీలకు లేనిమాట  నిజమే కావచ్చు. కానీ భారతి రచనల వంటి గానాత్మక కవిత్వం మనకు లేదు. అట్లే వల్లత్తోల్ వలె బహు గ్రంధాలను వుత్తమమైనవి  రచించిన మహాకవులు మనకు లేరు. తమ రచనలతో బీరువాలు నింపిన కవులు మనకూ ఉన్నారు. కానీ వాళ్ళు,  గుణంలో వల్లత్తోల్ కు దీటు రారు.  మన పరోక్షంలో కూడా ఇతరులు మన్నించేటట్లు మనం మాట్లాడుకోవడం న్యాయం.
    గురజాడ దేశభక్తి గీతం చాలా గొప్పది. తెలుగులో అటువంటిది మరిలేదు. అంతమాత్రాన ప్రపంచ సాహిత్యంలో అటువంటిది లేదు...
   (to be continued pl)

Sunday, 29 November 2015


Friends dears....
I think there is no need of any INTRO for the above post as it is COMPLETE one, which describes about mu AYYAGARU's thinking. I thank from my core of heart to Acharya Sreerangacharya for preserving this letter and sending this to VARTHA for printing and forwarding Dr. Puttaparthi to the next generation.

Sunday, 1 November 2015

punnaga : కరీణ్ణగరం లోని యజ్ఞ వరాహస్వామి పవిత్ర సన్నిధిల...

punnaga :



కరీణ్ణగరం లోని యజ్ఞ వరాహస్వామి పవిత్ర సన్నిధిల...
: కరీణ్ణగరం లోని యజ్ఞ వరాహస్వామి పవిత్ర సన్నిధిలో యీ పురస్కారం అందుకోవటం- యెంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమాన్ విజయసారధి గురువ...