Wednesday, 23 December 2015


శ్రీ అరవిందులవారి రాష్ట్ర స్థాయి సమావేశాలలో మా అయ్యగారిపై శ్రీ అరవిందులవారి ప్రభావం గురించి కొన్ని అనుభూతులను పంచుకునేనుదుకు డిసెంబర్ 19,20 తేదీలలో చిత్తూరుకు వెళ్ళిరావటం జరిగింది. అక్కడ నేను పాల్గొన్నప్పటి చాయాచిత్రాల్లివి. చాల విశేషాలు చెప్పాలని ఉంది. రెండు రోజుల్లో అక్కడి మరిన్ని విశేషాలు వివరంగా వ్రాస్తాను. అరవిందులవారి దర్శనం అయ్య తరచుగా చేసుకున్నా, అక్కడ శ్రీ అరవిందులవారితో వారి అనుభవలను యెంత ప్రయత్నించినా సేకరించలేక పోవటం- యెంతో నిరాశను కలిగించినా, అయ్య దగ్గర అరవిందులవారి 'ఊర్వశి' చదివిన జ్ఞాపకాలు మధురమైనవి. పదాల పోహళింపూ, భావ గాంభీర్యతా- అనితర సాధ్యాలే కాక, అనుసరణకందనివి కూడా! అయ్యగారి భావజాలంలో అరవిందులవారి ప్రసక్తి సిద్ధాంతపరంగా, యెంతో సంక్లిష్టమైనదీ, సామాజిక ఆధ్యాత్మిక పరిశోధనతో కూడుకున్నది కూడా! అన్నట్టు, అక్కడ, మా అయ్యగారు, 1960లో వ్రాసిన విప్లవ యోగీశ్వరుడు, అన్న చిన్ని పొత్తము (ధర అమూల్యం) నా చేతులమీదుగా పునరావిష్కరింపబడటం- నా మహద్భాగ్యమే! ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులవారు యీ పుస్తక పునర్ముద్రణ చేయమని కార్యనిర్వాహకులకు, సూచించటం-ఆ విద్యాఖని   ఆదేశం అక్కడ పాటించటమూ- గొప్ప విషయం. అయ్య సంతానంలో ఒకదానిగా జన్మించటం- యెంత గొప్ప భాగ్యమో అవగతమౌతూ ఉంటుందిలాంటి సన్నివేశాలలో! చిత్తూరు వాసులే కాక, రాష్ట్రం లోని అనేక శ్రీ అరవింద సంస్థలనుండీ ప్రతినిధులెందరో పాల్గొన్నారక్కడ! దాదాపు, అందరికీ అయ్యతో యేదో ఒక జ్ఞాపకమూ, దాన్ని పదిలంగా గుర్తు పెట్టుకుని, నన్ను చూసిన వెంటనే వాళ్ళా సంగతి ప్రస్తావించటం చూస్తుంటే, అయ్య నిజంగా ప్రజాకవి అనే అనిపించిందండీ!
ఆచార్య కోవెలవారితో అయ్యగురించి, యెన్నో విషయాలు మాట్లాడుకోవటం  ఆనందాన్నిచ్చింది. వారు నన్నొక విషయమై దదాపు ఆజ్ఞాపించరనే అనవచ్చు. అదెమిటో త్వరలో చెబుతాగా!
ఇప్పటికీ ఫోటోలు చూడండి. ఫేస్ బుక్ స్నెహితులందరూ, పుస్తక ప్రదర్శన సందర్శనంలో చాలా బిజీగా ఉన్నారుకదామరి-మీ సమయం యెక్కువ తీసుకోకూడదనీ!  
ఇవిగో, యీ చాయాచిత్రాలు చూడండి, వీటి వివరణ త్వరలో!










Tuesday, 15 December 2015

   అరబిందో మహర్షి గురించి మా అయ్యగారు  విప్లవయోగీశ్వరుడు అని


ఒక చిన్న పొత్తము, 1960 లో వ్రాశారు. అరవిందులవారి అవతరణ-


 రామకృష్ణ పరమహంస మహాసమాధి- ఆగష్ట్ 15 నే కావటం 


 ఘుణాక్షర న్యాయం వంటిదని కొందరంటారు కానీ, భారతదేశ స్వాతంత్ర


 సిద్ధి కూడా అదెరోజు కావటంలో యెదొ పెద్ద సందేశమే ఉందని వారి భావన.
 
డ్రూయట్  దంపతుల వద్ద తానున్న సమయంలో షేక్స్ పియర్ రచనలను


 తెగ చదివేవారట అరవిందులవారు! టెన్నీసన్,  వర్డ్స్ వర్త్ షెల్లీ,


కీట్స్..వీళ్ళందరి హృదయాలనూ వారు ఆపోసన పట్టేశారట!


అరవిందులవారి జీవిత సంగ్రహం వ్రాస్తూనే,  తనవైన వ్యాఖ్యలను
 
కూడా అక్కడక్కడా ఆనాడే వినిపించేవారు-పుట్టపర్తి వారు.



        'దేశభాషలెంత గొప్పవైననూ, భారతీయాత్మను సంపూర్ణముగా



వెల్లడింపలేవు. '
        'సాహిత్యము,  హృదయమును సంస్కరించుచూ, భావములు



విశాలమొనర్చును. కానీ,  సాధన, మర్గములనుపదేశించును.'

        'ఒక దేశము యొక్క విజ్ఞానము,  వికాసమొందవలెనన్నచో,  నా దేశము



 స్వతంత్రముగానుండవలయును.  స్వాతంత్ర్యమే, సర్వాభ్యుదయమునకూ, 


మూలము.' 
       'శంకరులవారి  తరువాత, అరవిందులవంటి మేధావి,



 ప్రపంచమునబుట్టలేదు. అతను విశ్వామిత్రునివంటివాడు.


 రజప్రేరితమైన యీ తపస్సు-శుద్ధ సాత్వికమై, పరిణామపేశలమైనది.


 విశ్వామిత్రుడు గాయత్రిని సృష్టించినట్లే, యరవిందులు,  భాగవత జీవన


విధానమును, నిర్ణయించెను.'
    'హిమాలయము వంటి మేధస్సు, క్షీరసముద్రము  వంటి కవితాశక్తీ-



రెండింటినీ జోడించిన యరవిందుల  మూర్తి-చిత్రాతిచిత్రమైనది.' 

   ఇలాంటి యెన్నో పుట్టపర్తివ్యాఖ్యలతో కూడిన యీ చిన్ని పొత్తము,

 
చిత్తూరులో యి 19, 20వ తేదీలలో జరుగుతున్న


రాష్ట స్థాయి అరబిందో సంస్మరణ


సభల సందర్భంగా పునర్మిద్రింపబడుతున్నది.


(నేనుకూడా వెళ్తున్నాను.) 

  అరబిందో భావజాలాన్నీ, మార్క్క్ భావజాలాన్నీ కలిపి కొత్త సిద్ధంతాన్ని 



 యెవరైనా కనిపెడితే బాగుండేదనీ, తనకిప్పుడు అ విశ్లేషణ చేయదగినంత


మానసిక, దైహిక శక్తులు లెవనీ తన చివరి రోజుల్లో వాపోయేవారు  (ఈ దిశగా


యెవరైనా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడటం లేదింకా.) .


  అరవిందులవారి ప్రభావం పుట్టపర్తిమీద నిండుగా మెండుగా వుంది మరి... 

Monday, 14 December 2015

punnaga :               నా జ్ఞాపకల మరుగుల్లో అరుగులు - 3...

punnaga :

              నా జ్ఞాపకల మరుగుల్లో అరుగులు - 3

...
:               నా జ్ఞాపకల మరుగుల్లో అరుగులు - 3 కడప మోచంపేట (అసలు పేరు మోక్షంపేట అట..క్రమంగా నోరుతిరగక అది మోచంపేటగా ప్రజల్లో స్థిర...

Thursday, 3 December 2015

Friendz dears....This post shows how thick was the


friendship of maa ayyagaru with Jammalamadakavaru.


....(courtesy- sri Ramavajhala Srisailam)









Wednesday, 2 December 2015


Part 5 (Final).of  Puttaparthi about Gurajada

కన్యక, పూర్ణమ్మ కథ రెండూ కరుణాత్మక కావ్యాలు.
 యెంతో గంభీరమైన భావాలను కూడా సూటిగా హృదయాలకు తాకేటట్లు తేటగా పిల్లలకు అర్థమయ్యేట్లు చెప్పడం గురజాడలోని మహా శక్తి. కన్యకలోని ఇతివృత్తాన్ని మరేవి ఐనా గంభీరమైన ప్రౌఢ కావ్యంగా మార్చి
వుండును. పూర్ణమ్మ కథలోని కరుణ మహ సుకుమరమైనది. దీనిలో యెత్తుగడ, అంతమూ- యెంతటి గంభీర హృదయాలనైన చలింపచేసేటంత లలితంగా వున్నయి. ఇంత సరళంగా, సూటిగా, సుకుమరంగా చెప్పగలగడం మహాకవులకు మత్రమే సాధ్యమౌతుంది. అ చిత్తవృత్తిలో అయన బాలసాహిత్యం వ్రాసివుంటే యెంత బాగుండునో ! (గురజాడ సాహిత్య విశిష్టతను పుట్టపర్తివారు ఆవిష్కరించిన తీరు చదువరులలో గురజాడవారిపట్ల అంతులెని గౌరవం పెంచటంతోపాటూ, పుట్టపర్తివారి బహు భాషావైదగ్ధ్యమూ, నిశిత పరిశీలనా శక్తి పట్ల కూడా ఆశ్చర్యానందాలు కలుగజేస్తుందనటంలో సందేహం లేదనిపిస్తుంది - నామట్టుకు నాకు ! యేమంటారు సహృదయ మిత్రులారా ! డా. వేదగిరి రాంబాబుగారు చాలాకాలంగా గురజాడవారి సహిత్యానికి అపారమైన సేవ చేస్తున్నారు. అనేకానేక ప్రాంతలలో, యెంతో శ్రమకోర్చి, సమావేశాలు నిర్వహించారు. ఇటీవల గురజాడవారి వర్ధంతి నాడు, (30th nov) శ్రీయుత విహారి, సుధామగారల సంపాదకత్వంలో ఆ మహనీయునికి సరికొత్త కథానిక, కవితానివాళులర్పించి కొత్త వొరవడిని సృష్టించారు. (కవితానివాళిలో నా చిన్న కవితకూ స్థానం దక్కటం నా అదృష్టంగా భావిస్తున్నాను.) సాంస్కృతిక రాజకీయ రంగలలో సవ్యసాచి శ్రీమాన్ రమణాచారిగారి నిండు ఆశీస్సులతో జరిగిన యీ వేడుక మరిన్ని కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుడుతుందని ఆశిస్తూ...నాగపద్మిని పుట్టపర్తి)
..................... 











   Part 4 pl....
................
ఆయన ప్రయత్నించిన సామాజిక విప్లవం కూడా చాలా గొప్పది. తన కాలానికి   అతీతమైన సామాజిక దృష్టి ఆయనకుండేది. ఆయన కథలలో ఆ దృష్టి బాగా కనబడుతుంది.
 ఇక ఆయన హాస్యం తెలుగు సాహిత్యంలో సాటి లేనిది. ఆయన వుత్తరాలలో, వ్యాసాల్లోకూడా ఈ హాస్య దృష్టి కనబడుతుంది. సర్కస్ బఫూన్లు చేసే ఆంగిక వికారాలతోనూ,  కృతకమైన  శబ్ద చమత్కరాలతోనూ సృష్టించే హాస్యం అల్పమైనది. కన్యాశుల్కంలోని హాస్యం పాత్రల  స్వాభావిక ప్రవర్తనలోనూ, కథకు సహజమైన సన్నివేశాలతోనూ  ఇమిడి వుంది. ఇటువంటి హాస్యమే ఉత్కృష్టమైనది. గురజడ షృష్టించినట్టి హాస్యం నాజూకైన హాస్యం తెలుగులో మరిలేదు. గురజాడ కవిత్వంలో అంగ్ల సాహిత్యపు చాయలు వున్నయి. మొత్తం మీద ఇంగ్లీషు ప్రభావం ఆయనమీద యెక్కువగా వుందని చెప్పవచ్చు. ఆంగ్ల  విద్యమీద అయనకు అమితమైన గౌరవం. ఇది ఆనాటి కాల  ప్రభావమని చెప్పవచ్చు.  ఇంగ్లీషురాని పండితులు ఆనాడు  మహా చాందసులు. కూపస్థ మండూకాలు. ఇంగ్లీషు విద్య వచ్చినవారే అంతో ఇంతో విశాలంగా ఆలోచించగలిగేవాళ్ళు. ఇంగ్లీషువిద్య వల్లనే స్వతంత్ర ఆలోచనాశక్తీ, విశాల దృష్టీ అలవడుతాయని అనుకోవడం ఆనాటి పరిస్థితుల్లో   న్యాయమే! ఆనాటి యుగ స్వభావమే ఆయనలో ప్రతిఫలించింది.
   ముత్యాలసరాలు ఆయన తెలుగు కవిత్వానికి ఇచ్చిన కానుక.  ఆ చందస్సులో అంత కొత్తదనం లేకపోయినా బంధ కవిత్వాలూ, గర్భ కవిత్వాలూ  వ్రాసుకునే  రోజుల్లో సరళమైన గెయచందస్సులో కవిత్వం వ్రాయబూనుకోవడమే ఒక విప్లవం. అయన  సుభద్ర లో అక్కడక్కడా కావ్య  భాష దొర్లింది. ఋతు శతకం అనేది సామాన్యులకు అర్థమయ్యేట్లు లేదు. వీటిని ఆయన చిన్నప్పుడు అంటే సాహిత్యాన్ని గురించే ఆయన విశ్వాసాలు పరిణతి చెందక మునుపు వ్రాసినాడేమో అనిపిస్తుంది. అయన ఖండ కావ్యాలు యేవేవి యెప్పుడెప్పుడు వ్రాసిందీ తేదీలు కూడా లభ్యమై వుంటే బాగుండేది. 
(ఇంకా వుంది...)
 

Tuesday, 1 December 2015

Part 3
 

తెలుగులో నన్నయభట్టే ఆదికవి అని చాలారోజులు అనుకునేవాళ్ళం. నన్నయ భారతంవంటి ప్రౌఢరచన హఠాత్తుగా ఒకనాడు ఆవిర్భవించిందంటే నమ్మడం చాలా కష్టం. యెన్నో తరాలుగా యెంతమంది విస్మృత కవుల చేతిలోనో తెలుగు కవిత్వం క్రమ క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చి, నన్నయనాటికి, భారతం పరిపక్వ స్థితికి వచ్చిందనుకోవటం సమంజసం. ముఖ్యంగా బౌద్ధులూ, జైనులూ దేశీయ భాష ఐన తెలుగులో యెన్నో కావ్యాలు వ్రాసివుంటారని నా విశ్వాసం. ఆ యుగాలనాటి మతకలహాలలో హిందూ దురభిమానులు తమది పైచేయైనప్పుడు, ఆ సాహిత్యాన్నంతా నాశనం చేసి ఉంటారు. గురజాడ బతికి వున్నప్పుడే యుద్ధమల్లుని బెజవాడ శాసనం దొరికింది. యుద్ధమల్లుడే ఆదికవి అని ఆయన సాహసంగా గుర్తించినాడు. కన్నడంలోని పంపభారతం గురించికూడా ప్రస్తావించినాడు. నన్నయ భారతంలో పంపభారతం యొక్క ప్రభావం కనబడుతున్నదని కొన్ని యేండ్ల కిందట ఆలంపూర్ సాహిత్య సభలో నేను సోదాహరణంగా నిరూపించినప్పుడు తెలుగు భక్తులందరూ నా మీద విరుచుక పడినారు. నేనసలు తెలుగువాణ్ణే కాదనీ, మారువేషంలో వున్న కన్నడంవాణ్ణనీ నన్ను నిందించారు. నేను చెప్పిన అభిప్రాయం గురజాడ ఆనాడే వెలిబుచ్చినాడు. కానీ తెలుగువాళ్ళ దురభిమానం మితిలేనిది. నన్నయ మహాకవి అంటే వాళ్ళకు తృప్తిలేదు. నన్నయ ఋషి అనే చాదస్తులూ, నన్నయ దేవుడు అనే మూర్ఖులూ బయలుదేరినారు..

గురజాడ చిన్నప్పటినుండే ఇంగ్లీషులో గద్య పద్యాలలో రచనలు చేసేవాడు. సంస్కృతం బాగా రావటమే కాక సంస్కృత వ్యాకరణంతో కూడా మంచి పరిచయం వున్నట్టు వూహించవచ్చు. అనంద గజపతి మహా ప్రౌఢుడైన కవి. అయనచుట్టూ, దిగ్దంతులవంటి పండితుల గౌరవం పొందినాడంటే వారి పాండిత్యం సామాన్యంగా వుండదు.
గజపతి వంటివారు, గురజాడను ఆదరించడం ఒక ఆశ్చర్యమైన విషయం.
.....................

గురజాడ సాధించిన సాహిత్య విప్లవం చాలా గొప్పది. బాల వ్యాకరణ ప్రౌఢ వ్యాకరణ సూత్రాలకు లోబడిన ప్రయోగాలు తెలుగులో చాలా యెక్కువగా వున్నయి. ఆంధ్ర శబ్ద చింతామణి మొదలుకొని తెలుగు వ్యాకరణాలన్నీ చాలా సంకుచితమైన దృష్టి గలవి. మన వ్యాకర్తలు శైవ సాహిత్యాన్ని గుర్తించనేలేదు. కృష్ణరాయల తరువాత వచ్చిన ప్రబంధాలకూ, మధుర తంజావూరు రాజుల కాలంలో వచ్చిన వచన సాహిత్యనికీ వాళ్ళూ యేమాత్రమూ విలువ ఇవ్వలేదు. అందుకనే ఆ వ్యాకరణాలు అంత సంకుచితంగా తయారైనాయి. అసలు ఒక జీవద్భాషను వ్యాకరణ సూత్రాలలో బంధింపజూడటమే కుంజర యూధమును దోమ కుత్తుకలో యిరికించడానికి చేసే ప్రయత్నం వంటిది. జీవద్భష ఐన తెలుగులో అనంతమైన ప్రాంతీయ భేదాలున్నాయి. అట్లే, సంస్కృతంలోనూ పాణిని వ్యాకరణానికి వ్యతిరేకమైన ప్రయోగాలు అనేకం - వ్యాసునిలో, వాల్మీకిలో, అంతకు పూర్వపు వైదిక సాహిత్యంలో వున్నాయి. సంస్కృతం జీవద్భాషగా వున్న రోజుల్లో బౌద్ధ జైన వాజ్మయాలలొ యీనాటి మహాపండితులకు కూడా అర్థం తెలియని ప్రయోగాలు అనేకం చేయబడ్డాయి. కాబట్టి జీవన భాషను వ్యాకరణపు సంకెళ్ళలో బంధించబూనుకోవడం సాహితీపరులెవ్వరూ సహింపకూడని విషయం. యీదృష్టితో వ్యాకరణ భక్తులకు వ్యతిరేకంగా గురజాడచేసిన రచనలు తెలుగు సాహిత్యానికి నూత్న యౌవనం ప్రసాదించినాయి. సశేషం...(ఇది 1968 ప్రాంతాలలో కడపలో జరిగిన గురజాడ వర్ధంతి సభలో పుట్టపర్తివారు వెలువరించిన అభిప్రాయాలకు అభిప్రాయాలకు విశాలాంధ్ర వార్తా పత్రిక ప్రకటించిన విపుల వార్తా వ్యాఖ్యలోని భాగం)
                                                    2-12-15