Tuesday, 15 December 2015

   అరబిందో మహర్షి గురించి మా అయ్యగారు  విప్లవయోగీశ్వరుడు అని


ఒక చిన్న పొత్తము, 1960 లో వ్రాశారు. అరవిందులవారి అవతరణ-


 రామకృష్ణ పరమహంస మహాసమాధి- ఆగష్ట్ 15 నే కావటం 


 ఘుణాక్షర న్యాయం వంటిదని కొందరంటారు కానీ, భారతదేశ స్వాతంత్ర


 సిద్ధి కూడా అదెరోజు కావటంలో యెదొ పెద్ద సందేశమే ఉందని వారి భావన.
 
డ్రూయట్  దంపతుల వద్ద తానున్న సమయంలో షేక్స్ పియర్ రచనలను


 తెగ చదివేవారట అరవిందులవారు! టెన్నీసన్,  వర్డ్స్ వర్త్ షెల్లీ,


కీట్స్..వీళ్ళందరి హృదయాలనూ వారు ఆపోసన పట్టేశారట!


అరవిందులవారి జీవిత సంగ్రహం వ్రాస్తూనే,  తనవైన వ్యాఖ్యలను
 
కూడా అక్కడక్కడా ఆనాడే వినిపించేవారు-పుట్టపర్తి వారు.



        'దేశభాషలెంత గొప్పవైననూ, భారతీయాత్మను సంపూర్ణముగా



వెల్లడింపలేవు. '
        'సాహిత్యము,  హృదయమును సంస్కరించుచూ, భావములు



విశాలమొనర్చును. కానీ,  సాధన, మర్గములనుపదేశించును.'

        'ఒక దేశము యొక్క విజ్ఞానము,  వికాసమొందవలెనన్నచో,  నా దేశము



 స్వతంత్రముగానుండవలయును.  స్వాతంత్ర్యమే, సర్వాభ్యుదయమునకూ, 


మూలము.' 
       'శంకరులవారి  తరువాత, అరవిందులవంటి మేధావి,



 ప్రపంచమునబుట్టలేదు. అతను విశ్వామిత్రునివంటివాడు.


 రజప్రేరితమైన యీ తపస్సు-శుద్ధ సాత్వికమై, పరిణామపేశలమైనది.


 విశ్వామిత్రుడు గాయత్రిని సృష్టించినట్లే, యరవిందులు,  భాగవత జీవన


విధానమును, నిర్ణయించెను.'
    'హిమాలయము వంటి మేధస్సు, క్షీరసముద్రము  వంటి కవితాశక్తీ-



రెండింటినీ జోడించిన యరవిందుల  మూర్తి-చిత్రాతిచిత్రమైనది.' 

   ఇలాంటి యెన్నో పుట్టపర్తివ్యాఖ్యలతో కూడిన యీ చిన్ని పొత్తము,

 
చిత్తూరులో యి 19, 20వ తేదీలలో జరుగుతున్న


రాష్ట స్థాయి అరబిందో సంస్మరణ


సభల సందర్భంగా పునర్మిద్రింపబడుతున్నది.


(నేనుకూడా వెళ్తున్నాను.) 

  అరబిందో భావజాలాన్నీ, మార్క్క్ భావజాలాన్నీ కలిపి కొత్త సిద్ధంతాన్ని 



 యెవరైనా కనిపెడితే బాగుండేదనీ, తనకిప్పుడు అ విశ్లేషణ చేయదగినంత


మానసిక, దైహిక శక్తులు లెవనీ తన చివరి రోజుల్లో వాపోయేవారు  (ఈ దిశగా


యెవరైనా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడటం లేదింకా.) .


  అరవిందులవారి ప్రభావం పుట్టపర్తిమీద నిండుగా మెండుగా వుంది మరి... 

No comments:

Post a Comment