Wednesday 23 December 2015


శ్రీ అరవిందులవారి రాష్ట్ర స్థాయి సమావేశాలలో మా అయ్యగారిపై శ్రీ అరవిందులవారి ప్రభావం గురించి కొన్ని అనుభూతులను పంచుకునేనుదుకు డిసెంబర్ 19,20 తేదీలలో చిత్తూరుకు వెళ్ళిరావటం జరిగింది. అక్కడ నేను పాల్గొన్నప్పటి చాయాచిత్రాల్లివి. చాల విశేషాలు చెప్పాలని ఉంది. రెండు రోజుల్లో అక్కడి మరిన్ని విశేషాలు వివరంగా వ్రాస్తాను. అరవిందులవారి దర్శనం అయ్య తరచుగా చేసుకున్నా, అక్కడ శ్రీ అరవిందులవారితో వారి అనుభవలను యెంత ప్రయత్నించినా సేకరించలేక పోవటం- యెంతో నిరాశను కలిగించినా, అయ్య దగ్గర అరవిందులవారి 'ఊర్వశి' చదివిన జ్ఞాపకాలు మధురమైనవి. పదాల పోహళింపూ, భావ గాంభీర్యతా- అనితర సాధ్యాలే కాక, అనుసరణకందనివి కూడా! అయ్యగారి భావజాలంలో అరవిందులవారి ప్రసక్తి సిద్ధాంతపరంగా, యెంతో సంక్లిష్టమైనదీ, సామాజిక ఆధ్యాత్మిక పరిశోధనతో కూడుకున్నది కూడా! అన్నట్టు, అక్కడ, మా అయ్యగారు, 1960లో వ్రాసిన విప్లవ యోగీశ్వరుడు, అన్న చిన్ని పొత్తము (ధర అమూల్యం) నా చేతులమీదుగా పునరావిష్కరింపబడటం- నా మహద్భాగ్యమే! ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులవారు యీ పుస్తక పునర్ముద్రణ చేయమని కార్యనిర్వాహకులకు, సూచించటం-ఆ విద్యాఖని   ఆదేశం అక్కడ పాటించటమూ- గొప్ప విషయం. అయ్య సంతానంలో ఒకదానిగా జన్మించటం- యెంత గొప్ప భాగ్యమో అవగతమౌతూ ఉంటుందిలాంటి సన్నివేశాలలో! చిత్తూరు వాసులే కాక, రాష్ట్రం లోని అనేక శ్రీ అరవింద సంస్థలనుండీ ప్రతినిధులెందరో పాల్గొన్నారక్కడ! దాదాపు, అందరికీ అయ్యతో యేదో ఒక జ్ఞాపకమూ, దాన్ని పదిలంగా గుర్తు పెట్టుకుని, నన్ను చూసిన వెంటనే వాళ్ళా సంగతి ప్రస్తావించటం చూస్తుంటే, అయ్య నిజంగా ప్రజాకవి అనే అనిపించిందండీ!
ఆచార్య కోవెలవారితో అయ్యగురించి, యెన్నో విషయాలు మాట్లాడుకోవటం  ఆనందాన్నిచ్చింది. వారు నన్నొక విషయమై దదాపు ఆజ్ఞాపించరనే అనవచ్చు. అదెమిటో త్వరలో చెబుతాగా!
ఇప్పటికీ ఫోటోలు చూడండి. ఫేస్ బుక్ స్నెహితులందరూ, పుస్తక ప్రదర్శన సందర్శనంలో చాలా బిజీగా ఉన్నారుకదామరి-మీ సమయం యెక్కువ తీసుకోకూడదనీ!  
ఇవిగో, యీ చాయాచిత్రాలు చూడండి, వీటి వివరణ త్వరలో!










No comments:

Post a Comment