Part 4 pl....
................
ఆయన ప్రయత్నించిన సామాజిక విప్లవం కూడా చాలా గొప్పది. తన కాలానికి అతీతమైన సామాజిక దృష్టి ఆయనకుండేది. ఆయన కథలలో ఆ దృష్టి బాగా కనబడుతుంది.
ఇక ఆయన హాస్యం తెలుగు సాహిత్యంలో సాటి లేనిది. ఆయన వుత్తరాలలో, వ్యాసాల్లోకూడా ఈ హాస్య దృష్టి కనబడుతుంది. సర్కస్ బఫూన్లు చేసే ఆంగిక వికారాలతోనూ, కృతకమైన శబ్ద చమత్కరాలతోనూ సృష్టించే హాస్యం అల్పమైనది. కన్యాశుల్కంలోని హాస్యం పాత్రల స్వాభావిక ప్రవర్తనలోనూ, కథకు సహజమైన సన్నివేశాలతోనూ ఇమిడి వుంది. ఇటువంటి హాస్యమే ఉత్కృష్టమైనది. గురజడ షృష్టించినట్టి హాస్యం నాజూకైన హాస్యం తెలుగులో మరిలేదు. గురజాడ కవిత్వంలో అంగ్ల సాహిత్యపు చాయలు వున్నయి. మొత్తం మీద ఇంగ్లీషు ప్రభావం ఆయనమీద యెక్కువగా వుందని చెప్పవచ్చు. ఆంగ్ల విద్యమీద అయనకు అమితమైన గౌరవం. ఇది ఆనాటి కాల ప్రభావమని చెప్పవచ్చు. ఇంగ్లీషురాని పండితులు ఆనాడు మహా చాందసులు. కూపస్థ మండూకాలు. ఇంగ్లీషు విద్య వచ్చినవారే అంతో ఇంతో విశాలంగా ఆలోచించగలిగేవాళ్ళు. ఇంగ్లీషువిద్య వల్లనే స్వతంత్ర ఆలోచనాశక్తీ, విశాల దృష్టీ అలవడుతాయని అనుకోవడం ఆనాటి పరిస్థితుల్లో న్యాయమే! ఆనాటి యుగ స్వభావమే ఆయనలో ప్రతిఫలించింది.
ముత్యాలసరాలు ఆయన తెలుగు కవిత్వానికి ఇచ్చిన కానుక. ఆ చందస్సులో అంత కొత్తదనం లేకపోయినా బంధ కవిత్వాలూ, గర్భ కవిత్వాలూ వ్రాసుకునే రోజుల్లో సరళమైన గెయచందస్సులో కవిత్వం వ్రాయబూనుకోవడమే ఒక విప్లవం. అయన సుభద్ర లో అక్కడక్కడా కావ్య భాష దొర్లింది. ఋతు శతకం అనేది సామాన్యులకు అర్థమయ్యేట్లు లేదు. వీటిని ఆయన చిన్నప్పుడు అంటే సాహిత్యాన్ని గురించే ఆయన విశ్వాసాలు పరిణతి చెందక మునుపు వ్రాసినాడేమో అనిపిస్తుంది. అయన ఖండ కావ్యాలు యేవేవి యెప్పుడెప్పుడు వ్రాసిందీ తేదీలు కూడా లభ్యమై వుంటే బాగుండేది. (ఇంకా వుంది...)

No comments:
Post a Comment