Part 5 (Final).of Puttaparthi about Gurajada
యెంతో గంభీరమైన భావాలను కూడా సూటిగా హృదయాలకు తాకేటట్లు తేటగా పిల్లలకు అర్థమయ్యేట్లు చెప్పడం గురజాడలోని మహా శక్తి. కన్యకలోని ఇతివృత్తాన్ని మరేవి ఐనా గంభీరమైన ప్రౌఢ కావ్యంగా మార్చి
వుండును. పూర్ణమ్మ కథలోని కరుణ మహ సుకుమరమైనది. దీనిలో యెత్తుగడ, అంతమూ- యెంతటి గంభీర హృదయాలనైన చలింపచేసేటంత లలితంగా వున్నయి. ఇంత సరళంగా, సూటిగా, సుకుమరంగా చెప్పగలగడం మహాకవులకు మత్రమే సాధ్యమౌతుంది. అ చిత్తవృత్తిలో అయన బాలసాహిత్యం వ్రాసివుంటే యెంత బాగుండునో ! (గురజాడ సాహిత్య విశిష్టతను పుట్టపర్తివారు ఆవిష్కరించిన తీరు చదువరులలో గురజాడవారిపట్ల అంతులెని గౌరవం పెంచటంతోపాటూ, పుట్టపర్తివారి బహు భాషావైదగ్ధ్యమూ, నిశిత పరిశీలనా శక్తి పట్ల కూడా ఆశ్చర్యానందాలు కలుగజేస్తుందనటంలో సందేహం లేదనిపిస్తుంది - నామట్టుకు నాకు ! యేమంటారు సహృదయ మిత్రులారా ! డా. వేదగిరి రాంబాబుగారు చాలాకాలంగా గురజాడవారి సహిత్యానికి అపారమైన సేవ చేస్తున్నారు. అనేకానేక ప్రాంతలలో, యెంతో శ్రమకోర్చి, సమావేశాలు నిర్వహించారు. ఇటీవల గురజాడవారి వర్ధంతి నాడు, (30th nov) శ్రీయుత విహారి, సుధామగారల సంపాదకత్వంలో ఆ మహనీయునికి సరికొత్త కథానిక, కవితానివాళులర్పించి కొత్త వొరవడిని సృష్టించారు. (కవితానివాళిలో నా చిన్న కవితకూ స్థానం దక్కటం నా అదృష్టంగా భావిస్తున్నాను.) సాంస్కృతిక రాజకీయ రంగలలో సవ్యసాచి శ్రీమాన్ రమణాచారిగారి నిండు ఆశీస్సులతో జరిగిన యీ వేడుక మరిన్ని కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుడుతుందని ఆశిస్తూ...నాగపద్మిని పుట్టపర్తి)
.....................
No comments:
Post a Comment