Saturday, 17 December 2016

Navarasabharitam Na Telugu Padyam by Dr. Garikipati Narasimharao garu


గరికపాటివారి నోట పుట్టపర్తివారి మాట....వీరరస వర్ణన..
కదన ముఖంబునన్, పిరికి కండలు కాననివారు ధీరతా
స్పదులగు  భర్తలు ఉద్దవిడి, శాత్రవులన్ చెరలాడి వచ్చుచో,
అదును దొలంకు వారి కరవాలపు నెత్తుట కుంకుమాకృతుల్,
వదనమునందు దిద్దుకొను పత్నులకెల్ల నమస్కరించెదన్..(సాక్షాత్కారం నుండి) 
గరికపాటివారంటరూ...ఈ పద్యాన్ని, మన రాజకీయ నాయకుల ఇళ్ళముందు, ఫ్లెక్సీలుగా  పెట్టాలట! కేవల ధన సంపాదనమీదే దృష్టిఉంచి రాజకీయాల్లో చేరటం కాదు. ప్రజలతరఫునే వాదించాలి కానీ..అవకాశవాదాన్ని ఆశ్రయించటం కాదు అంటారు . క్షత్రియ వనితలు భర్తలు యుద్ధానికి వెళ్ళేటపుడు తమరక్తంతో తిలకం దిద్దుతారు.....  విజయంతో భర్త ఇంటికి వచ్చాక కత్తికంటిన శత్రువుల రక్తంతో తాము తిలకం దిద్దుకుంటారు. ఈ పౌరుషం ఇప్పుడేదీ? ధర్మము అన్నమాటకు, మనమనుకునే అర్థమే కక విల్లు అనికూడా అర్థం ఉంది. ధర్మ రక్షణకై విల్లుకూడా అందుకోవలసిన అవసరం ఉంటుందెప్పుడూ..అంటారు వారు..(52 వ నిముషం నుండీ పన్నెండు నిముషాలపాటు పుట్టపర్తి పద్య విశ్లేషణ) మొత్తం వినండి..అద్భుతంగా ఉంది ఆ వాక్ప్రవాహం... 
ఈ వీడియో వివరాలిచ్చిన శ్రీ అంబటిపూడి నాగ త్రివిక్రంగారికి (డల్లాస్) ధన్యవాదాలు, ఆశీస్సులు..  



Friday, 2 September 2016

అపరాధ సహస్ర భాజనం.....



.....
రవిగారి వ్యాఖ్య..నా గుండెలోని మంటకు అక్షర రూపం ఇచ్చి


 మీవంటి మంచి మిత్రులతొ పంచుకుని ఉపశమనం పొందే ప్రయత్నానికి   పురికొల్పింది. 

అయ్య అజరామరులే..నా బాధంతా కడుపున పుట్టికూడా 


కొంతైనా ఆ  సరస్వతీ పుత్రుని అనుసరింపకపోయామే 

అని..అడుగడుగునా ఆ బాధ   అన్నమయ్య చెప్పినట్టు, గుండె 

నిండా ఒక మంటవలె సలుపుతూనే  ఉంటుంది ...

.'అపరాధ సహస్ర  భాజనం .. పతితం భీమ భవార్ణవోదరే, 

అగతిం  శరణాగతిం, హరే:! కృపయా కేవలమాత్మసాత్ కురు 

అని పూజ తరువాత    ముగింపులో రోజూ మంగళాశసనం లో 


చెప్పుకునే యీ శ్లోకం రాగానే   దానిలోని 'అపరాధ సహస్త్ర 

భాజినం' అన్న పదం దగ్గరే నాకెప్పుడూ   ..'గుండె గొంతుకడ్డం

 పడి, శ్లోకం ముందుకు జరుగదు.అయ్యా, మా అమ్మల 

మూర్తిమత్వాన్ని గుర్తించలేని అజ్ఞానంలో వాళ్ళు శరీరధారులై 


ఉన్నన్నాళ్ళూ, కళ్ళుకు గంతలు కట్టినట్టు, అవివేకపు పొర

మనసును కమ్మేసే ఉంచాడా పైవాడు. తెలిసీ, తెలియకా, 

వాళ్ళిద్దరినీ అందరి   తల్లిదండ్రులవలెనే భావించి, బాధించి, 

ఇప్పుడు వాళ్ళిద్దరూ కీర్తిశేషులైన   తరువాతే, కేవలం 

పశ్చాత్తాపానికే పరిమితం చేశాడా పైవాడని.....అపరాధ


 భావం..ఈ లోనున్న మంట,జీవిత గమనంలో నాకైతే చాలా


 సందర్భాలలో.


. ప్రత్యేకించి, ప్రతి వత్సరమూ ఆగష్ట్ 2 నుండీ,సెప్టెంబర్ 1


 వరకూ...ఊపిరి   సలుపనివ్వదు.. అయ్య అవతారం

 చాలించేందుకు కొన్ని రోజుల ముందు   అప్పటి, మా ఆనంద్

 బాగ్ ఇంట్లో, మామిడి చెట్టుకింద మంచంలో


పడుకునీ, ఇంటి ముందు వరండాలో కూర్చుని, తన 


అనారోగ్యం బాధను   శరీరానికే పరిమితం చేస్తూ, తనప్రియ 

శిష్యుడు, రఘోత్తమ రావుకు కొన్ని  రోజులు భాగవత 


శ్లోకార్థాలు చెప్పేవారు. మేమంతా అన్నయ్యగా 

పిలుచుకునే మాలేపాటి సుబ్రమణ్యం, అయ్య శారీరిక 

అవసరాలకు తోడుగా  ఉండేవాడు. అప్పుడూ నాకు వెధవ 

ఆఫీసు గోలే!! ఆ అపురూప క్షణాల్లో  అందివచ్చిన ఆ 

వ్యాఖ్యాశ్రవణ భాగ్యాన్ని పొందలేక పోయానే అని యెంత 


బాధో ! మ అన్నయ్యతో పాటూ, నేనూ అయ్య మల


మూత్రాదులు శుభ్రం చేస్తుంటే, కన్నీళ్ళు పెట్టుకుని

 'ఆడపిల్ల తో చేయించుకుంటున్నాను. ' అని 

బాధ పడ్డారు కూడా ! నేనన్నాను..నేను మీ బిడ్డనయ్యా



 ..నాకూ మీ బాధ్యత   ఉందంతే. మీరు బాధపడవద్దండీ '

అని..ఆగష్ట్ 18 హైద్రాబాద్ నుండి   బలవంతంగా కడపకు 

వెళ్ళిపోయారు. సెప్తెంబర్ 1 నాటికి ఉదయాన్నే


 టెలిగ్రాం. ఇక కథంతా తెలిసిందే..అందుకే .. 




యీ అపరాధ భావం....





ఈ సమూహం నాకింతమంది మంచి, సమస్పందనలున్న

 స్నేహ  సంపదనిచ్చిందనీ.., నా బాధలూ, సంతోషాలూ మీతో 


పంచుకున్నా తృప్తే కదా అని.. యెంతో ధైర్యంగా 



ఉంటుందిప్పుడు తెలుసా....

Wednesday, 31 August 2016



 సెప్టెంబర్ 1 -  సరస్వతీ పుత్రుని 26వ వర్ధంతి. మా అయ్యగారికి కన్నీటి నివాళి.





కన్నుల్ గానక నీదు భవ్య కవితా గానంపు మర్మమ్ములన్

  పన్నొందన్  రస రమ్య రీతులనుగా  వర్ణింప నే  వింటినే?

మిన్నున్ మన్నును గానకే  మహిషినై యీలాగుపేక్షించితిన్, 
         
   నన్నున్ నీ నిజ పుత్రికన్ కరుణతో నారాయణా ! బ్రోవవే!

మూడవ పాదమందు అచ్చు ఆధారంగా సంధియుత యతి మైత్రి (చందం.డాట్.కం.

 ప్రామాణికంగా )  గుర్తించడమైనది.)      
   
  
...............


ఇరువది యైదు వత్సరములీగతి అయ్యరొ!  యీడ్చితేను, నా 

 కిరవగు రీతులందు తవ కీర్తనమందున సొక్కి సోలితిన్,
    
   మరువక నన్ను నీదు పధమందున  జేరుచుకొమ్ము ! నీ దయా

  మరువక సౌరభమ్ములవి మామక జీవన భావి గావలెన్.     

Sunday, 19 June 2016

 Frends...
These r the glances of a Ph.D Thesis on maa ayyagaru's Sreenivasa Prabandham, a very recent work recommended. 

 Me with Dr. Smt .Padmavathi, , Research scholar of Nagarjuna University,  (a grand daughter of Late  Dr.Andra Seshagiri Rao garu,) at Kuppam Dravida University in 2014.







Monday, 30 May 2016

A Very big thanks to sri Guttikonda Subba Raogaru (28th May, '16) 
  Me on stage speaking about Maa ayyagaru (courtesy Dr.Smt Padmavathi who got Ph.D. very recently on 'Sreenivasa Prabandham' of maa ayyagaru


Wednesday, 27 April 2016

Frends dears..
These r the details of 2 day PUTTAPARTHI SAHITI SAMARCHANAM, planned and arranged by me, thru the association I formated in 1996. The plan actually was to honour a literary legend with a heavy purse of 25k (probably maa ayyagaru himself might  not have received that worth purse I remember). But due to my domestic and personal reasons, I shifted to the mission of printing maa ayyagaru's books instead. So I think thru that activity,  I have succeeded in preserving and presenting the very valuable writings of maa ayyagaru to the literary world. Now as per my thinking, nearly 90% of maa ayyagaru's literature is made available to his LITERARY LOVERS, I thought to organise a two day SAHITI SAMARCANAM of maa ayyagaru, (GADYA PADYA SAHITYAM of Puttaparthi varu)  with descriptive lectures by stallwarts in those fields.
   Frends dears...Here r the details of the 2 day meet. Pl treat this as my HRIDAYA POORVAKA AHVANAM...




  SAHITI MITRULAKU SADARA AHVANAM...

Tuesday, 26 April 2016

Frends dears.......Pl.check out  here tomorrow too  for more details (More information about the function  .......)

Sunday, 27 March 2016

                          అయ్యా! మీకు జన్మదిన శుభాకాంక్షలు...
             మళ్ళీ మళ్ళీ ...
             మీ కడుపునే పుట్టేలా ఆశీర్వదించండి !
             మా ఆచార్యులు మీరే! 

              ఆరాధ్యులూ  మీరే !  
              ఇప్పటికీ ! యెప్పటికీ !
                                                 (28-3-1914 )

Saturday, 19 March 2016

Dr KV Ramana Chary ,IAS Retd Advisor to Govt Released Book Of Dr Puttapa...



Part 2 of the book releasing function of maa ayyagaru Dr.Puttaparthi Narayanacharya on 14th March 2016 at Telangana bhavan in the august presence of Dr.K.V.Ramanacharya, Cultural advisor to the Govt. of Telangana




Book Release of VIMARSA Tarangini of Dr.Puttaparthi.by Dr.K.V.Ramanachar...



Part I  of the book releasing function of maa ayyagaru's VIMARSA TARANGINI in Telangana Bhavan, on 14th March 2014 in the august presence of Dr.K.V.Ramanacharya, advisor to the Govt. of Telangana.






 

Tuesday, 15 March 2016


Frends dears...
I am very much excited with this joy of released CRITISISM books (2parts) of my revered  father Dr.Puttaparthi. My dream of 25 years is now fulfilled by this edition of my father's works.
I will be more happy if my father's fans, read them and share their views. They may be available at NAVODAYA and TELUGU BOOK HOUSE, both at Arya samaj Road, Kachiguda cross Roads, Hyderabad.
 

Tuesday, 8 March 2016


త్వరలో రాబోతున్న 'పుట్టపర్తి విమర్శతరంగిణి' -రెండవభాగము

........................

          ప్రస్తుతము ప్రకటించిన 'ఋతుఘోష' రెండు కావ్యముల సంకలనము. ఋతువర్ణనము ప్రధానంగా నడుస్తుంది. ఒక ప్రియాప్రియుల ప్రేమగాధ అంగంగా సాక్షాత్కరిస్తుంది. ఈ సంకలనమెందుకని కవిగారినే ప్రశ్నించినాను. ఋతువర్ణనమొక్కటే ఐతే చదవడానికి బాగుండదేమోనని ఈ పని చేసినామన్నారు. చేర్చకుండా వుంటే బాగుండేదని నా ఊహ....
.............
         శర్మగారిలో విశ్వనాధ, జాషువా, రాయప్రోలు, కృష్ణాశాస్త్రి మొదలగువారి పలుకుబడులు అక్కడక్కడా కనబడుతూ ఉంటాయి. శర్మగారికి తెనాలి రామకృష్ణుడన్నా పక్షపాతమే ! కొన్ని చోట్ల ఈ కవి, నేరుగా ఉమర్ఖయ్యాముకు శిష్యుడై కనిపిస్తాడు. వర్షఋతువును వర్ణిస్తూ, 'ఆత్మవేదనకొక యాకారమై తోచి నేటి రేయి నన్ను కాటు వేసె' అంటాడు. ఇట్టి పోకడలనే, 'సబ్జెక్టివ్ పొయెట్రీ ' అంటారు మర్మవిదులు.

...........


 

              'ఆరుద్ర' కు నియమోల్లంఘనం చేయడమే స్వభావమని చెప్పినాను. కనుక యీ రచనలో, బాల వ్యాకరణాన్నీ, పాణినీయాన్నీ వెదకడం కష్టం. కవిత్వమనే పదార్థం ఇంతకు మించినది అనే దృష్టిని పట్టుకుంటే, యీ కావ్యం చదువవచ్చు.
  జయంగొండార్ కవి తమిళంలో చాలా ప్రసిద్ధుడు. లలితుడుకూడా !
పరణి అని వీరకావ్యానికి పేరు. యెటువంటి వీరకావ్యం అనే విషయంలో ఒకటి రెండు వ్యాఖ్యాన భేదాలు లేకపోలేదు. కవి మొదటి కుళోత్తుంగుని ఆస్థానంలో వుండినాడు. మదటి కుళోత్తుంగుడు, మన రాజరాజనరేంద్రుని కుమారుడే ! చోళ చాళుక్యులకు చాలా సంబంధ బాంధవ్యాలుండేవి.
      తమిళంలోకి మనం ప్రవేశించినప్పుడు, కొన్ని కొన్ని కొత్త సంకేతాలూ, అలంకారాలూ, ఆచారాలూ- మన కంట పడతాయి. తమిళ వాంగ్మయమే సంస్కృతంతో సంబంధంలేని ఒక మహా ప్రపంచం. ఉడుక వాద్యంతో నడుమును పోల్చడం, పగడసారెలతో స్తనమండలాన్ని పోల్చడమూ అంతే !
................
         శేషేన్ గారి 'ౠతుఘోష' కు పుట్టపర్తి 18-2-63 నాటి విపుల పీఠికా, ఆరుద్ర గారి తమిళానువాదం 'వేసవి- వెన్నెల' పై పుట్టపర్తి వారి చెణుకులూ ('63)..మరింకా యెన్నేన్నో. పుట్టపర్తి వివిధ భాషా సాహితీవిన్నాణానికి అద్దంపడుతూ..'పుట్టపర్తి విమర్శ తరంగిణి - రెండవ భాగం' లో మీముందుకు రాబోతున్నాయి....

........................






పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ : ఏకవీర నవల కేవలం మూడు రోజులలోనే మళయాళం లోకి

పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ : ఏకవీర నవల కేవలం మూడు రోజులలోనే మళయాళం లోకి: శ్రీరంగాచార్యులు గారు పుట్టపర్తి గురించి చెప్పిన విశేషాలు.. పుట్టపర్తి ఏకవీర నవలలు కేవలం మూడు రోజులలోనే మళయాళం లోకి అనువదించారట.. ఈ రికా...

'పుట్టపర్తి విమర్శ తరంగిణి - రెండవ భాగం'




 

నాకాంగ్లముపై ద్వేషము లేదు. అది మనదేశమునకెంతయో ఉపకారము చేసినది. ఇంగ్లీషును తిట్టు పండితులను చూసిన నాకసహ్యమే ! ఒక ఇంగ్లీషేమి? ప్రతిభాషకూడ యెంతో యుపకారమొనర్చును. ఆంగ్లేయులుకూడ మనభాషకు తక్కువ సేవచేసినవారు కాదు. దక్షిణభాషలకు మొదటి నిఘంటువును వ్రాసినవారందరునాంగ్లేయులే ! బ్రౌనుదొర మనభాషకుచేసిన సేవ సామాన్యమైనదికాదు. అదియాతనికి తండ్రినుండి సంక్రమించిన యాస్తి. అతడు వంగాదిభాషలకెంతయో సేవచేసినవాడు. ఆంగ్లేయులు సంస్కృతమునకు చేసిన సేవ మనము సిగ్గుపడవలసినంతటిది.'

ఆంగ్లేయ పండితుల గురించీ, బ్రౌను దొర గురించి పుట్టపర్తి తన అభిప్రాయాలను ఇంత కుండబద్దలు కొట్టేలా వెలువరించిన సందర్భమేది? త్వరలో మీముందుండబోతున్న 'పుట్టపర్తి విమర్శ తరంగిణి - రెండవ భాగం'లో యీ వాస్తవాలు మీముందుకు రాబోతున్నాయి... .





Monday, 7 March 2016


 'ఉత్తరాది మఠ స్వాములు సత్య ధ్యానతీర్థులుండిరి. వారు ద్వైతులు. దానశూరులు. వారికదిశంకరుల గ్రంధములు కొట్టిన పిండి. వాదములలో శాంకర గ్రంధములలో పరస్పర వైరుధ్యములు చూపెడివారు. పూర్వపక్షమునకేయవకాశమివ్వరు. వీరుజూపించు విరోధములనెత్తిపోసుకొనుటలొనే  ప్రతివాదులకు, సరిపోవును. ఇదియొక మహాప్రతిభ. కళాశాలాధ్యక్షులు సుబ్బరావుగారుండిరి. అదియొక జ్ఞానప్రధానావతారము.  వారేశాస్త్రములో పూర్వపక్షము జేసిననూ, సమాధానము వారుజెప్పవలసినదే! అట్టి వాద సభలు కాళిదసన్నట్టు, 'కాంతుం క్రతుం చాక్షుషం..' .అంతే !
   (త్వరలో రాబోతున్న పుట్టపర్తి  విమర్శతరంగిణి(రెండవభాగము) నుండీ! (ప్రతులు  కావలసిన మిత్ర బృందము వివరములకొరకై నాకు   సందేశమివ్వగలరు)



Thursday, 3 March 2016




Ayya remembered on the eve of SIVARATRI in Today's (4th March 2016)Andhra Jyothi (Nivedana Page)

Tuesday, 23 February 2016



అయ్య పేరుతో  'శివతాండవం'  ముడివడిపోయి ఇప్పటికి  అరవైయేళ్ళు దాటిపోయింది. 1955నాటి ద్వితీయ ముద్రణ గుంటూరు ఆంధ్ర సంసత్ వాళ్ళు చేసినది. అప్పటికి,  నలభై పదుల వయసున్న నారాయణుని ముందు మాటలొ తొణికిసలాడుతున్న వినయ సంపదకు ముగ్ధులవని వారుంటారా, అనిపించింది నాకైతే! యీ పోష్ట్ లో, దీనితోపాటూ, అయ్య యే విషయం గురించైనా  వ్రాసుకునే నోట్స్ స్వదస్తూరిలో ఉన్నది  పొందుపరచాను. జాగ్రత్తగా చూడండి.  చిన్న చిన్న అక్షరాలలో, యెంతో శ్రద్ధగా,తనకు మరీ ముఖ్యంగా తోచిన విషయాలను, రేఖాంకితం చేసుకోవటం-  ఇవన్నీ, యెంతో  యేకాగ్రతతో చెసుకునేవారాయన యెప్పుడూ - రాత్రీ పగలూ తేడాల్లేకుండా!  మిద్దె మీద ఉన్నంతసేపూ, సాహితీ గహనవనాల్లో,  అలసటెరుగక  విహరించిన ఆ కవికిశోరం -  మిద్దె దిగి కిందికి, యీ వాస్తవ ప్రపంచంలొకి వస్తే, యెంత తేడా తెలుస్తుండేదో కదా!  అయ్య మాటల్లోనే....  'యెంతసేపూ,  పప్పూ, వుప్పూ, చింతపండూ సంపాదనలోనే  తనకలాడి, యేదో అలిసిపోయినట్టు, గుర్రుపెట్టేవాళ్ళకేంతెలుస్తుంది, యెంత శ్రమ పడితే, పాండిత్యం  ఒంటపడుతుందో!" ఇంతకూ, శివతాండవం శిఋషిక కిందున్న ఆంగ్ల కొటేషన్ గమనించండి. జీవిత రహస్యం యేమిటంటే, పెద్ద ఆశయాలను సాధించే క్రమంలో, చిన్న చిన్న అకర్షణలను త్యగం చేయవలసు ఉంటుందని...నాకైతే, ఇదేవిధంగా  అర్థమైంది...మీరూ  ఆలోచించండి - మీకేవైనా కొత్త అర్థాలు తడుతాయేమో!























 

Monday, 15 February 2016



రాసీమ రత్నం- బెళ్ళూరి

అయ్య బెళ్ళూరి శ్రీనివాసమూర్తిగారిని చాలా  ఇష్టపడేవారు. చిన్న తనంలో వారిని బాగా దగ్గరగా చూసినట్టే గుర్తు. వారు, మా తాతగారు  శ్రీమాన్ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారికి శిష్యుడుకూడా కావటంవల్ల, వాళ్ళిద్దరి మధ్యా స్నేహ బంధమలా పెనవేసుకుందేమో!   వారి రచనల బైండింగ్ ఒకటి  నాకు శ్రీమాన్ రావినూతల శ్రీరాములుగారి ద్వారా యెప్పుడో అందింది.  తపోవనము (1954)  తో పాటూ ఇందులో,   కావ్యగంగ (1957) అన్న దనిలోని కొన్ని రసగుళికలు, మీకోసం! ఇందులో  వున్నవి.. గురు ప్రశంస పేరిట, మా తాతగారిగురించిన పద్యాలు, అయ్యకు అనంతపురంలో వీడ్కోలు సందర్భంగా వారు  చదివిన పద్యలూ, రాయలసీమ గురించి వారి రసరమ్య భావనలూ...వీటిని ఆస్వాదించండి!  ఇంకా యీ సంకలనం ఆకర్షణను  అద్భుత చిత్రాలు (చిత్రకారునిపేరు  నా కంటికి  కనబడలేదు మరి) అదనం....